Bhakthi Rasaayanamu Chapters Last Page
శ్రీ శివ పంచాక్షర స్తోత్రము
[శ్రీ శంకరాచార్య విరచితము]
నాగేంద్రహారాయ సులోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తసై#్మ న కారాయ నమశ్శినాయ.
మందాకినీ సలిల చందన చర్చితాయ
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ
మందారపుష్ప బహు పుష్ప సుపూజితాయ
తసై#్మ మ కారాయ నమశ్శినాయ.
శివాయ గౌరీవదనాబ్జబృంద
సూర్యాయ దక్షాధ్వరనాశకాయ
శ్రీ నీలకంఠాయ వృష ధ్వజాయ
తసై#్మ శి కారాయ నమశ్శివాయ.
వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య
మునీంద్ర దేవార్చిత శేఖరాయ
చంద్రార్క వైశ్వానర లోచనాయ
తసై#్మ వ కారాయ నమశ్శివాయ.
యక్షస్వరూపాయ జటాధరాయ
పినాకహస్తాయ సనాతనాయ
దివ్యాయ దేవాయ దిగంబరాయ
తసై#్మ య కారాయ నమశ్శివాయ.
పంచాక్షర మిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ
శివలోక మనాప్నోతి శివేన సహమోడతే